Kavita: ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కవితకు ఆహ్వానం.. ఎందుకంటే..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆక్స్‌ఫర్డ్ యూనిర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్ 30న నిర్వహించే కార్యక్రమంలో.. డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎలా పురోగమించింది, రైతులకు రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, అలాగే 24 గంటల ఉచిత కరెంట్ తదితర అంశాలపై కవిత ప్రసంగం చేయనున్నారు.

MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు
New Update

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లండన్ నుంచి ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనిర్సిటీ నుంచి ఆహ్వానం వచ్చింది. అక్టోబర్ 30న ఆ విశ్వవిద్యాలంలో ఓ కార్యక్రమం నిర్వహంచనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో.. కవిత 'డెవలప్‌మెంట్ ఎకనామిక్స్' అనే అంశంపై ప్రసంగం చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆమె మాట్లాడనున్నారు. ఇటీవలే.. బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత లండన్‌కు పయనమయ్యారు. ఆ సమయంలోనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ఆమెతో సమావేశమయ్యారు. ఈ తరుణంలోనే తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై తాము నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆమెకు ఆహ్వానం పలికింది.

వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎలా పురోగమించింది, రైతులకు రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, అలాగే 24 గంటల ఉచిత కరెంట్ తదితర అంశాలపై కవిత ప్రసంగం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహించడమే కాకుండా.. అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. వైద్య, విద్యా రంగంలో కూడా రాష్ట్రం సాధించిన అభివృద్ధిపై కూడా ఆమె మాట్లాడనున్నారు.

#telugu-news #telangana-news #mlc-kavita #oxford-university
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe