MLA Padi Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) విమర్శలు గుప్పించారు హుజురాబాద్ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అధికారం చేతిలో ఉండదని గత ప్రభుత్వంపై ఇష్టం వచినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవలం వార్తలో హైలెట్ కావడానికి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని కించపరిచేలా రేవంత్ రెడ్డి భాష ఉందన్నారు.
ALSO READ: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు… మరో బాంబు పేల్చిన మల్లారెడ్డి
రేవంత్ రెడ్డి జైలుకే..
కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే నే సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఓటుకు నోటు కేసు (Vote Ku Note Case) చివరి దశకు వచ్చిందని, వాటికి పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు, ఆ కేసును తప్పించుకునేందుకు సీఎం ఏకనాథ్ షిండేగా మారతారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకార మాటలకి వారి మంత్రులే ఎదురు తిరిగే రోజులు వస్తాయని అన్నారు.
ఫేక్ ప్రచారాలు..
గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులను వారి ఖాతాలో కాంగ్రెస్ నేతలు వేసుకుంటారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన పనులు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు వీటన్నిటిని చూసి నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి వాటిలో దాదాపు లక్ష 60 వేలకు పైచిలుకు ఉద్యోగాలు కూడా భర్తి చేశారని.. 42 వేల పైచిలుకు ఉద్యోగాలకు కూడా రాత పరీక్షలు అయిపోయి ఉన్నాయని ఎన్నికల నోటిఫికేషన్ తో ఆ ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పోలీస్ కానిస్టేబుల్, నర్సింగ్ నియామకాల పత్రాలు ఇచ్చారని అవి కూడా తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోవె అని అన్నారు.
ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి నలుగురు నేతలు
DO WATCH: