MLA KTR: రేవంత్ రెడ్డి సీఎం కావడం మన ఖర్మ.. కేటీఆర్ ఫైర్!

గుజరాత్‌ మోడల్‌ను సీఎం రేవంత్ ప్రశంసించడంపై కేటీఆర్ మండిపడ్డారు. మోడీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ అంటూ నిప్పులు చెరిగారు.

MLA KTR: రేవంత్ రెడ్డి సీఎం కావడం మన ఖర్మ.. కేటీఆర్ ఫైర్!
New Update

KTR Warned CM Revanth Reddy: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో గుజరాత్ రాష్ట్రాన్ని పొగుడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆత్మగౌరవం విలువ తెలువనోడు సీఎంగా ఉండడం దౌర్భాగ్యం అని అన్నారు. మోడీ సాక్షిగా తెలంగాణ (Telangana) ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కేటీఆర్ ట్విట్టర్ (X) లో .."రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా... రేవంత్ (CM Revanth Reddy) దాడి, అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. “Golden తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిది.. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..?" అని నిలదీశారు.

"నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్ పై.. నిప్పులు !, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. గొప్పలా ?, ఇదేం నీతి.. ఇదేం రీతి.. తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా”. “సమగ్ర అభివృద్ధికి చిరునామా”. అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్.. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..?" అని ప్రశ్నించారు.

Also Read: రాహుల్‌కు సీఎం రేవంత్ వెన్నుపోటు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

"నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన?, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..??. నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..”నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్.., కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది" అంటూ రాసుకొచ్చారు.

#modi #cm-revanth-reddy #ktr #brs #congress-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe