BRS MLA Harish Rao: రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే గానీ సర్కార్ లేవట్లేదని, పంచాయతీలో పారిశుధ్యం గురించి తాము లేవనెత్తాకే కార్మికులకు జీతాలందించారని విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ అన్ని పంచాయతీలకు నిధులు రాలేదని, కేసీఆర్ (KCR) హాయంలో ప్రతి నెల పంచాయతీలకే రూ. 275 కోట్ల రూపాయలు టంచనుగా విడుదల చేసే వాళ్ళమని చెప్పారు. మార్చి కన్నా ముందు కేంద్రం రూ. 500 కోట్లు పంచాయతీల కోసం విడుదల చేసిందన్నారు. వాటినీ కూడా రాష్ట్రం విడుదల చేయలేదని, ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో రూ. 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని చెప్పారు. రెండు నెలల ఆసరా పెన్షన్లు (Aasara Pensions) ఇవ్వలేదు. మేము నిలదీశాకే ఒక నెలవి ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచ్చిందని మండిపడ్డారు.
రూ.2500 కోట్ల బిల్స్ పెండింగ్ లో..
ఈ మేరకు రూ.2500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నయన్నారు. కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడిందని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం రూ. 350 కోట్లు విడుదల చేయలేదు.. కేంద్రo మంజూరు చేసిన నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయక పోతే వడ్డీ వసూలు చేస్తారు. బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఊరు మనబడి కింద బిల్లులు ఇవ్వక బాత్ రూములు కూడా తెరవని పరిస్తితి ఉంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు జీతం రాలేదు. పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇపుడు బదిలీలు చేస్తున్నారు. వారికి డబ్బులు ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు. సిద్ది పేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు లభించడం సంతోష దాయకమన్నారు. స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్ ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు హరీష్ రావు.
విద్యుత్ శాఖలో తీవ్ర సంక్షోభం..
ఇక రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, కనీసo రోజూ వారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదన్నారు. విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉందని, కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారని మండిపడ్డారు. తొండలు, బల్లుల వల్లే కాదు హరీష్ రావు చెబితే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెబుతున్నారు. రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వడం లేదు. స్తంభాలు కూడా ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టడం లేదు. స్కూళ్లకు కరెంటు బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తున్నారు. పోలీసులకు పెట్రోల్ డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కొంత పర్చెంటేజి పోలీసులు ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదు. హోం గార్డులకు జీతాలు సరిగా రావడం లేదు. కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi) షాదీముబారక్ లకు తులం బంగారం లేదు. కొత్తగా చెక్ లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. దాదాపు లక్ష చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. సిద్దిపేటలోనే 3 వేలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. రైతు బీమా చెక్కులు నెల రోజులు దాటినా రావడం లేదు. కేసీఆర్ హాయంలో వారం రోజుళ్లో ఐదు లక్షల బీమా చెక్ వచ్చేదీ. రైతు రుణ మాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేదు. పీఎం కిసాన్ యోజనకు రైతు రుణ మాఫీకి లింక్ పెడుతున్నారు. మా అధ్యయనం ప్రకారం లక్ష లోపు రుణ మాఫీకి అర్హులైన 30 నుంచీ 40 శాతం మందికి మాఫీ కాలేదంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు ఏం చెప్పానంటే?.. RTVతో RRR ఎక్స్‌క్లూజివ్!
రూ. 59 వేల అప్పు ఉంటే రూ. 3 వేలే మాఫీ..
అలాగే పీఎం కిసాన్ యోజనలో 18 యేండ్లు దాటిన వారిని యాజమానితో సంబంధం లేకుండా లబ్ది దారుడిగా పరిగణిస్తారు. కానీ రుణ మాఫీలో ఆలా చేయడం లేదన్నారు. ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి? ఆదిలాబాద్ లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు రూ. 59 వేల అప్పు ఉంటే రూ. 3 వేలే మాఫీ అవుతున్నట్టు మెసేజ్ వచ్చింది. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధన లేదని ఉత్తగా చెబితే కాదు కొత్త ఉత్తర్వులు ఇవ్వండి. పీఎం కిసాన్ నిబంధన పెట్టకండి. గత ప్రభుత్వం నిబంధనలే ఆమలు చేస్తున్నామని మంత్రులు చెబితే మరి వాటినే అమలు చేయండి. కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారు. అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం నెలకు రూ. 40 లక్షలు ఇచ్చేవారు. అవి ఏడు నెలలుగా బంద్ అయ్యాయి. చాలా డివిజన్లు చెత్త కూపాలుగా మారాయి. జీహెచ్ఎంసీ ఫిర్యాదుల విభాగం పనితీరు అస్తవ్యస్తమైంది. ఒకటో తారీఖు జీతాలు చాలా మంది సిబ్బందికి రావడం లేదు. హాస్పిటల్స్ లో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయి. ఏ బదిలీల్లో పారదర్శకత లేదు. రోడ్డెక్కని వర్గమే లేదు. 2 వేల పడకల ఆస్పత్రులకు సూపెరెంటిండెంట్ గా పని చేసిన వారిని వంద పడకల ఆస్పత్రులకు పంపారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపితే వారు అక్కడ ఏం చేస్తారు? పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు ఉద్యోగుల సీఎం రేవంత్ సమావేశం పెట్టి సమస్యలు తీరుస్తా అన్నాడు. కానీ అవేమి అమలు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్ ల కు ఫ్రీ కరెంటు జీవో..
ఇక స్కూల్ టాయిలెట్ల శుభ్రత సరిగా లేదని చెప్పారు. స్కూల్ ల కు ఫ్రీ కరెంటు జీవో ఇస్తామన్నప్పటికీ అది ఇవ్వలేదు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఫ్రీ కరెంటు బంద్ చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు. ఆనాడు మాట్లాడింది ఏమిటీ ఇపుడు రేవంత్ చేస్తున్నదేమిటీ? అర్హత గల తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉంటే డీజీపీగా పంజాబ్ ఆయనను ఎందుకు నియమించావ్. నేను బీహార్ పంజాబ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదన్నారు. రేవంత్ అన్న మాటల్నే గుర్తు చేస్తున్నానని చెప్పారు. ఈ అధికారుల గురించి రేవంత్ అపుడేమి అన్నాడో అన్నిటిని బయటపెడుతాను. బిహారీ లంటే దోపిడీ దారులని అన్నాడు అన్నావ్. అప్పుడు వద్దు అన్న వారు ఇపుడు ఎలా నియమించారు. మేము ఆనాడు మహేందర్ రెడ్డిని డీజీపీగా నియమించాం. సర్వీసెస్ లో వికలాంగులు పనికి రారని స్మిత సబర్వాల్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.