Harish Rao : బీసీ జన గణన చేపట్టాలి.. హరీష్ రావు డిమాండ్

బీసీ జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని పేర్కొన్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు.

New Update
Harish Rao: రాహుల్ గాంధీ హరీష్ రావు లేఖ

MLA Harish Rao : సిద్దిపేట(Siddipet) జిల్లా ఎర్రవల్లి కేసీఆర్(KCR) నివాసంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పార్లమెంటరీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao). కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్రంలో అనుసరిస్తున్న తీరును ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు మొత్తం 13 గ్యారెంటీలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ జన గణన చేపట్టాలని అన్నారు.

అన్యాయం జరుగుతుంది..

కృష్ణా రివర్ బోర్డు(Krishna River Board) కు ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని అన్నారు హరీష్ రావు. ఆలా చేయడం ద్వారా తెలంగాణ(Telangana) కు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణ రివర్ బోర్డుకు అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని అన్నారు. కేంద్రం దీనికి సంబంధించిన మినట్స్ కూడా బయట పెట్టిందని తెలిపారు. కృష్ణా జలాల్లో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రాజెక్టుపైకి తెలంగాణ అధికారులు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఓవైపు రాష్ట్ర మంత్రి మేం సంతకాలు పెట్టలేదని మాట్లాడుతున్నాడని అన్నారు.

Also Read : నియంతృత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

ఘోరంగా ఫెయిల్ అయ్యింది..

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందని అన్నారు హరీష్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని బీఆర్ఎస్ పార్లమెంటరీ బృందం కలుస్తుందని అన్నారు. గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని పేర్కొన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Cement Corporation Of India) ను పునరుద్ధరిస్తామని గతంలో అమిత్ షా(Amit Shah) హామీనిచ్చారని గుర్తు చేశారు.

బీసీ జన గణన చేపట్టాలి..

బీసీ జన గణన చేపట్టాలని అన్నారు హరీష్ రావు. పార్లమెంటు గట్టిగా గొంతు వినిపిస్తాం.. కాంగ్రెస్ పార్టీలో పూటకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం కనిపిస్తుందని అన్నారు. హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పుతో కొడతామని ఒకరు అంటున్నారు.. వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.

13 హామీలు ఉన్నాయి..

ఆరు గ్యారంటీల్లో(6 Guarantees) 13 హామీలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకు ఓపిక ఉంది, ప్రజల కోసం ప్రశ్నిస్తాం అని అన్నారు. ప్రతిపక్షాలపై బురద జల్లడంపైనా, కుట్రలు చేయడంపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారని ఫైర్ అయ్యారు. గెలిచిన వాళ్లకు ఓపిక, ప్రతిపక్షాలను కలుపుకునిపోయేలా ఉండాలని అన్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే దుందుడుకు స్వభావంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Also Read : ఏంఐఏంలోకి డీకే అరుణ.. వంశీ చంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
తాజా కథనాలు