Harish Rao: తమపై బురదజల్లేందుకే.. శ్వేతపత్రంపై హరీష్ ఫైర్!

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజెంటేషన్‌లో సత్యదూరమైన విషయాలు ఉన్నాయని రావు అన్నారు. తమపై బురదజల్లేందుకే ఈ పేపర్ ప్రజెంటేషన్‌ పెట్టారని ఫైర్ అయ్యారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీలో కూడా అబద్దాలు ఆడుతుందని అన్నారు.

New Update
Harish Rao: తమపై బురదజల్లేందుకే.. శ్వేతపత్రంపై హరీష్ ఫైర్!

Harish Rao: శ్వేతపత్రం పేరుతో ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని.. శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజెంటేషన్‌లో సత్యదూరమైన విషయాలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం రూ.775 కోట్లు కేటాయించి పూర్తి చేసిందని పేర్కొన్నారు. కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లేందుకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.

ALSO READ: నన్ను ఎందుకు చేర్చుకున్నారు.. కాంగ్రెస్‌పై రాజ్‌గోపాల్ రెడ్డి సీరియస్!

తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. తాము అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇంకో సభ్యులకు అనుమతి ఇవ్వొద్దని స్పీకర్ ను కోరారు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన విషయాలు బుక్ లో పొందుపరిచారు అని మండిపడ్డారు. ఆయకట్టు రెండు చోట్ల రెండు రకాలగా చెప్పారని.. వాస్తవం మాత్రం ఇంకోలా ఉందని అన్నారు. హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014కి ముందు అంటే నిజాంకి ముందు ఆ తర్వాత అని చెప్పుకొచ్చారు. నిజాం అప్పటి నుంచి నిధులు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు.. రాయలసీమ లిఫ్ట్ గురించి అబద్ధాలు రాశారని హరీష్ అన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై హరీష్ కౌంటర్ ఇచ్చారు.. వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ ఇది అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారం చేశారని చురకలు అంటించారు.. సభలో కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగిస్తామని మినిట్స్ మీటింగ్ లో ఉందని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన మీటింగ్ లో కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పారని ఫైర్ అయ్యారు. సభలో ఇచ్చిన పుస్తకం తప్పుల తడకగా ఉందని అన్నారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు