Harish: కేసీఆర్ పని అయిపోయిందని.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు 2009లో పది సీట్లు వచ్చాయని హరీష్ రావు అన్నారు. ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని కోరారు. ఎంపీ ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలని అన్నారు.

Harish Rao: ఇదేం పద్ధతి.. రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్!
New Update

BRS MLA Harish Rao: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని అన్నారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.

ALSO READ: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్

పని అయిపోయిందని కేసీఆర్..

2009 లో బీఆర్ఎస్ కు పది సీట్లే వచ్చాయని అన్నారు హరీష్ రావు. ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని అన్నారు. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మించి అమలు చేయలేరని పేర్కొన్నారు.

తక్కువ ఓట్లతో గెలిచాడు..

మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడని అన్నారు హరీష్ రావు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఒక్క పైసా నిధులు తేలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలని అన్నారు. మల్కాజ్గిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచామని అన్నారు. ఇప్పుడు కూడా ఎంపీ సీటు గెలవాలని పేర్కొన్నారు. ఇది పరీక్షా సమయం.. మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అన్నారు.

కాంగ్రెస్ అభాసు పాలైంది..

కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని అన్నారు హరీష్. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని అన్నారు. కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని ఆరోపించారు.

బీజేపీ అబద్దాలు ప్రచారం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచిందని హరీష్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారని అన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాదు...

కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్ళీ అధికారంలోకి రావడం అరుదు అని హరీష్ పేర్కొన్నారు. రాజస్థాన్ లో, ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని అన్నారు. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పట్నుంచే నడుం బిగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ALSO READ: టార్గెట్ జగన్.. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

DO WATCH:

#mp-elections #cm-revanth-reddy #telangana-latest-news #harish-rao #congress-six-guarantees #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe