BRS : బీఎస్సీ పార్టీ(BSC Party) నుంచి బీఆర్ఎస్ లోకి ఈమధ్యనే చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో పాటూ తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా సమర్పించారు. నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సెంటు భూమి కూడా లేదంట. ఈవిషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే స్వయంగా పేర్కొన్నారు. కానీ తనపై క్రిమినల్ కేసులు(Criminal Cases) మాత్రం దడంఇగానే ఉన్నాయిన చెప్పుకొచ్చారు. మొత్తం 5 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారాయన.
తన కుటుంబ ఆస్తుల విలువ 1.41 కోట్లుగా ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీసు పెన్షన్‌ను ఆదాయవనరుగా చూపించారు. తన మొత్తం చరాస్తుల విలువ 73.39 లక్షలని.. ఇందులో తన కుమార్తె పేరిట చేసిన డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల విలువ 21.18 లక్షలుగా ఉందని చెప్పారు. దీంతో పాటూ ప్రస్తుతం ఆయన దగ్గర 10 వేల 500 నగదు, భార్య దగ్గర 5 వేలు ఉన్నట్లు తెలిపారు. ఇక బంగారం విషయానికి వస్తే.. మొత్తం కుటుంబం దగ్గర 40 తులాల బంగారం ఉందన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. ఇందులో తన దగ్గర 5 తులాలు, సతీమణి దగ్గర 15 తులాలు, కుమారుడు దగ్గర 5, కుమార్తె దగ్గర 15 తులాలు ఉన్నట్లు వివరించారు.
అయితే తన దగ్గర ఎలాంటి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు లేవని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 13.55 లక్షల విలువైన అసంపూర్తి ఇల్లు ఉందన్నారాయన. తమ కుటుంబానికి 51 లక్షల 80 వేల 897 రూపాయల అప్పు ఉందని వెల్లడించారు.
Also Read:Asaduddin Owaisi : 23.87కోట్ల ఆస్తితో పాటూ రెండు తుపాకులూ ఉన్నాయి..అసదుద్దీన్ ఓవైసీ