/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T162245.035.jpg)
RS Praveen Kumar Demands Postpone Of Group 1: తెలంగాణలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జూన్ 9న ఇంటిలిజెన్స్ బ్యూరో(IB) పరీక్ష కూడా ఉందని.. తెలంగాణ నుంచి చాలామంది నిరుద్యోగులు ఈ పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
Also Read: ప్రైవేట్ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం
అలాగే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ, పోలీసులు) గత నాలుగు నెలల నుంచి ఎన్నికల నిర్వహణలో ఉన్నందున వాళ్లకు పరీక్షకు ప్రిపేర్ అయ్యే అవకాశం లేకుండా పోయిందన్నారు. కాబట్టి ఒక నెల రోజులైన సమయం ఇస్తే.. లాస్ ఆఫ్ పే మీద సెలవులు తీసుకోని పరీక్షకు ప్రిపేర్ అవుతారని చెప్పారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు