KTR: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్...కేటీఆర్ ఆన్ ఫైర్! కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 20 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KTR Fires on Congress : కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు ఏమైయ్యాయని ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ప్రశ్నించారు. హామీలు చెప్పడం కాదు.. అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలు మార్చిపోతే తాము గుర్తు చేస్తూనే ఉంటామని.. ప్రజల సమస్యలపై పోరాడుతామని అన్నారు. ALSO READ: తెలంగాణలో మరో నాలుగు కరోనా కేసులు.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్(X) వేదికగా కాంగ్రెస్ పార్టీపై చురకలు అంటించారు. ఆయన ట్విట్టర్ లో.. 'గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు..ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..??,ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి, ఏర్పాట్లు చేసుకుంటున్నరా..?, గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి, రంగం సిద్ధం చేసుకుంటున్నరా..?, శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసం..?, అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి, తొండి వేషాలా..?, తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం, శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ, ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా..!, దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం, ఆడిట్ రిపోర్ట్ లు..ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా..!, ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి..ప్రజల ముందువుంచాం..!, మేం దాచింది ఏమీలేదు.. మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..!, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..!, మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తారా...?, అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు, నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..!, చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే..!, అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ ..!, అంచనాలు..అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా..?, వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు..!, మీరు ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటాం..!, ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదు.. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని..?, కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం.. హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ..!! జై తెలంగాణ' అంటూ రాసుకొచ్చారు. ALSO READ: అభ్యర్థుల ఖరారుపై జగన్ ఫోకస్..నేరుగా నేతలతోనే చర్చలు.. గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?? ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం… — KTR (@KTRBRS) December 19, 2023 #ktr #telangana-news #cm-revanth-reddy #congress-party #congress-6-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి