Harish Rao: డిసెంబర్ 9 ప్రభుత్వంలోకి రాగానే రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కానీ చెయ్యలేదు. తరువాత మళ్ళీ 100 రోజుల్లో చేస్తా అన్నారు..చెయలేదు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న అందరి దేవుళ్లపై ప్రమాణం చేసి 15 ఆగస్టు లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ 31 వేల కోట్లతో ఏకకాలంలో చేస్తా అన్నారు. ఇప్పుడు ఆగస్టు 15 రాత్రి, రేపు ఆగస్టు 16 ..కానీ ఇప్పటికి ఇంకా కేవలం 17934 కోట్లు మాత్రమే రుణమాఫీ విడుదల చేశారు. 36 లక్షల మంది రైతులుంటే కేవలం 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తూ…రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిండు అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Harish Rao: రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..అబద్ధాల కోరు-హరీష్ రావు
రైతులనే కాదు దేవుళ్లను కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రైతులందరికీ ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు కానీ ఇప్పుడు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: