Harish Rao: రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..అబద్ధాల కోరు-హరీష్ రావు

రైతులనే కాదు దేవుళ్లను కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రైతులందరికీ ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు కానీ ఇప్పుడు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
MLA Harish Rao: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్

Harish Rao: డిసెంబర్ 9 ప్రభుత్వంలోకి రాగానే రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కానీ చెయ్యలేదు. తరువాత మళ్ళీ 100 రోజుల్లో చేస్తా అన్నారు..చెయలేదు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న అందరి దేవుళ్లపై ప్రమాణం చేసి 15 ఆగస్టు లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ 31 వేల కోట్లతో ఏకకాలంలో చేస్తా అన్నారు. ఇప్పుడు ఆగస్టు 15 రాత్రి, రేపు ఆగస్టు 16 ..కానీ ఇప్పటికి ఇంకా కేవలం 17934 కోట్లు మాత్రమే రుణమాఫీ విడుదల చేశారు. 36 లక్షల మంది రైతులుంటే కేవలం 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తూ...రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిండు అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు.

ఈ మాత్రం రుణమాఫీ కూడా హరీష్ రావు చాలెంజ్ విసిరితే కానీ కాలేదు.నువ్వన్నట్టు ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి,ఏ కటింగులు పెట్టొద్దు. 6 గ్యారంటీలు ,13 హామీలు ఆగస్టు 15 లోపు అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు ,13 హామీలు,రుణమాఫీ ఏది అమలు చేయకుండానే దబాయిస్తున్నావు..నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు.
17,934 కోట్లతో 22 లక్షల రైతులకు అరకొరా రుణమాఫీ చేసి పిట్టల దొర మాటలు మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల క్రితమే 2014 లో కేసీఆర్ గారు మొదటి సారి 17 వేల కోట్లతో 32 లక్షల రైతులకు మరియు 2018 లో రెండవ సారి 12 వేల కోట్లతో మొత్తంగా 29 వేల కోట్లతో రుణమాఫీ చేసిన సంగతి గుర్తు తెచ్చుకో.. అంటూ హరీష్ రావు మాట్లాడారు.

ఎన్నికల ముందు మీరు ఇచ్చిన రుణమాఫీ హామీలో లేని కటింగ్ లు ,షరతులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి హరీష్ రావు ప్రశ్నించారు. ఇకనైనా ఊకదంపుడు ఉపన్యాసాలు, అహంకారపు మాటలు మాని ఎలాంటి షరతులు లేకుండా..చెప్పినట్టుగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి లేకుంటే నీకు దేవుళ్ళు.. ప్రజలు..రైతులు తగిన శాస్తి చెస్తారన్నారు హరీష్ రావు.

Also Read: Odisha: నెలసరికి సెలవు..మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక 

Advertisment
Advertisment
తాజా కథనాలు