/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Bonthu-Ram-mohan-jpg.webp)
Bonthu Rammohan to Join Congress: బీఆర్ఎస్ పార్టీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం కానున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై (BRS Party) ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రేవంత్‌ని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీలపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ వారిపై సీరియస్ అయ్యారు. సీఎం ఇంటికెళ్లి కలవడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ (KCR) వార్నింగ్ తర్వాత కూడా రేవంత్‌ని బొంతు రామ్మోహన్ కలవడంపై త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసిన బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్.
BRS leader Bontu Rammohan met Chief Minister Shri Revanth Reddy at his residence.@revanth_anumula @bonthurammohan pic.twitter.com/LHje11HRAH
— Congress for Telangana (@Congress4TS) February 11, 2024