Balka Suman: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఉద్దేశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం పై ఇలా మాట్లాడితే అరెస్ట్ (Arrest) తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అరెస్ట్ చేయాల్సిందే అని మెజార్టీ మంత్రులు అంటున్నారు. అలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందేనని నేతలు అంటున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
దళిత లీడర్ కాబట్టి వ్యతిరేక ప్రచారం జరుగుతోందని మరికొందరు చర్చలు పెడుతున్నారు. ఇలాగే ఉపేక్షిస్తే రేపు అందరూ సీఎం పై అలాగే మాట్లాడుతారని మంత్రులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమన్ ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపో, మాపో అరెస్ట్ తప్పదంటూ సంకేతాలు వినిపిస్తున్నాయి.
Also Read: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి
నేను బయపడను..
బాల్క సుమన్ ఇంటికెళ్లిన పోలీసులు నోటీసులు అందించారు. అయితే స్వయంగా నోటీసులు అందుకున్న బాల్క సుమన్ ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడుతూ.. కేసులకు అసలే బయపడనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కావాలనే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ(Telangana) ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, ఇలాంటి వాటికి తాను ఆందోళన చెందే వ్యక్తిని కాదన్నారు. అలాగే రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ అంటూ.. తమ నాయకులు ఎవరూ కేసులకు భయపడరని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.