Fight Over Water Between BRS and Congress: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో వాటర్ వార్ అంతకంతకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ రానున్న ఎన్నికల్లో తన సత్తా చూపించాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో బలంగా ఢీకొంటోంది. అటు కాంగ్రెస్ ప్రతివిమర్శలతో బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే వైట్‌పైపర్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరిట బీఆర్‌ఎస్ గత 10ఏళ్ల పాలనను లక్ష్యంగా చేసుకున్నది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అస్త్రమైన కాళేశ్వరం ప్రాజెక్టే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ హస్తం ఆయుధం కానుంది. ప్రాజెక్టు చుట్టూ అవినీతి ఉందని.. అది బహిరంగంగా బయటపెడతామని ప్రణాళిక సిద్ధం చేసుకున్న రేవంత్ సర్కార్.. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయనుంది. అదే సమయంలో నల్గొండలో బీఆర్‌ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు.
టార్గెట్ కేసీఆర్?
బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు బ్యారేజీ మధ్యలోని పిల్లర్లకు బీటలు వారగా బ్యారేజీ కుంగింది. ఆ తర్వాత గేట్ల వద్ద బీటలు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బగా మారింది. దీనినే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకుంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. మధ్యలో కేఆర్‌ఎంబీ:
మరోవైపు నాగార్జున సాగర్, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ నల్గొండ బహిరంగ సభలో ప్రధానంగా హైలెట్ చేయనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా బేసిన్ అవసరాలపై నాటి బీఆర్‌ఎస్ సర్కార్ తగిన శ్రద్ధ చూపలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యానికి 299 అడుగుల టీఎంసీ అడుగుల స్థూలమైన అన్యాయమైన నిష్పత్తికి అంగీకరించిందని చెబుతోంది.
Also Read: ప్రధాని మోడీ రెండురోజుల పాటు యూఏఈ పర్యటన.. నేడు అబుదాబికి పయనం!
WATCH: