Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న!

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారా? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? చెప్పాలంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న!
New Update

BRS-BJP: బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. మంగళవారం ఇదే అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన అసదుద్దీన్.. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారా? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? అంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ అంశంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓటమి తర్వాత అంటిముట్టనట్లే..
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంటిముట్టనట్లే ఉంటుంది. అంతేకాదు బీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ 8 చోట్ల డిపాజిట్‌ కోల్పోవడానికి క్రాస్‌ ఓటింగే కారణమైంది. బీఆర్‌ఎస్‌ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా. అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..
అలాగే జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందడంపై స్పందించారు. మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. తీవ్రవాదుల ఇండ్లలోకి వెళ్లి మట్టుబెడతామని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారని, ఆయన అలా చెబుతుంటే ఇప్పుడు జరుగుతున్నదేంటని నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కాషాయ పాలకులు ఉగ్రవాదాన్ని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు.

#brs #kcr #bjp #asaduddin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe