KCR : కేసీఆర్ మాస్ రీ-ఎంట్రీ.. అక్కడ తొలి బహిరంగ సభతో.

కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో ప్రజల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా కేసీఆర్ గజ్వేల్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా వరంగల్ లో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

New Update
KCR : కేసీఆర్ మాస్ రీ-ఎంట్రీ.. అక్కడ తొలి బహిరంగ సభతో.

KCR Mass Re-Entry : తెలంగాణ(Telangana) ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex CM KCR) ప్రజల ముందుకు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత మాజీ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్(Pragathi Bhavan) ప్రస్తుత ప్రజా భవన్ ను ఖాళీ చేసి.. ఎర్రవల్లి(Erravalli)లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్.. గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి.

కేసీఆర్ రీఎంట్రీ.. గజ్వేల్..

కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో గజ్వేల్(Gajwel) లో పర్యటిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కనుబాటలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రతిపక్ష హోదాలో అటు ఇటీవల జరిగిన అసెంబ్లీ లోనూ అలాగే బయట కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు వస్తుడడంతో భారీగా సన్నాహాలు చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తరువాత కేసీఆర్ మొదటి సరిగా గజ్వేల్ లో పర్యటించనున్నట్లు సమాచారం.

Also Read : కేసీఆర్ కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ

మొదటి బహిరంగ సభ..

పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడ ర్ తో వరుస భేటీలు జరిపేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న పార్టీ లోక్ సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలోనూ ఇదే తరహా మీటింగ్ లు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికల షెడ్యూలు వెలువడేలోపు బీఆర్ఎస్ సత్తాను చాటేలా అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు