EX CM KCR: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహాలపై కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
పాల్గొన్న ఎంపీలు..
ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీ లు పోతుగంటి రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి వీరితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పాల్గొన్నారు.
బలమైన వాదనలు వినిపించాలి...
ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు.
త్వరలో నేను వస్తున్న..
తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటున్న కేసీఆర్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో, ప్రజాక్షేత్రంలో దూరంగా ఉన్నారు. త్వరలో ప్రజా క్షేత్రంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఎవరు అధైర్య పడొద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
DO WATCH: