KCR Warned BRS Leaders: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు (BRS MLA'S & MP'S), ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దు అని అన్నారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని (Congress Government) వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు (Congress Ministers) వినతి పత్రాలు ఇవ్వండి అని అన్నారు. అదికూడా మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వాలని హెచ్చరించారు.
ALSO READ: ఖమ్మం ఎంపీ టికెట్.. కోటి ఆశలతో హనుమంతరావు!
ఎంపీలకు కేసీఆర్ సూచనలు..
పార్టీ ఎంపీలతో సమేవేశం అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. కృష్ణా నదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధికి ఇవ్వాలన్న కేంద్రం ప్రతిపాదనలపై ఎంపీలతో చర్చించారు. ఈ విషయంపై ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆందోళన చేపట్టాలని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి పార్టీ తరఫున నిరసన చెప్పాలని ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో రేపు (శుక్రవారం) పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆందోళనకు సిద్ధం అవుతున్నారు బీఆర్ఎస్ ఎంపీలు.
ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన