Telangana : నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ శ్రేణుల ధర్నా..

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిరసనకు పిలుపునిచ్చారు.

New Update
Telangana : నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ శ్రేణుల ధర్నా..

KCR Calls Statewide Protest : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులు ధర్నాలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని.. వీటిని కొనకుండా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ధ్వజమెత్తారు. ఎన్నికలైపోయిన తర్వాత వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెబుతూ రైతులను(Farmers) మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు.

Also Read: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!

Advertisment
తాజా కథనాలు