Video Viral: బ్రిటన్ ప్రధాని బ్యాటింగ్‌కు ఫిదా అయిన క్రికెటర్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రికెట్‌పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. వీడియో వైరల్‌గా మారడంతో పలువురు బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Video Viral: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రికెట్‌పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జిమ్మీ ఆండర్సన్ వేసిన మొదటి బంతిని ఎదురొన్న సునాక్.. రెండో బాల్‌కి ఔటయ్యారు. జిమ్మీ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసే ప్రాక్టీస్ కూడా చేసి వచ్చానని సునాక్ అన్నారు. ఆ తర్వాత యువ క్రీడాకారులతో ముచ్చటించారు. జిమ్మీ ఆండర్సన్ ఇటీవల టెస్టుల్లో 700 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. Am I ready for the call up @englandcricket? pic.twitter.com/nKIk5mNj7j — Rishi Sunak (@RishiSunak) April 5, 2024 ప్రాక్టీస్ సందర్భంగా సునాక్..జిమ్మీ ఆండర్సన్‌తో మాట్లాడారు. జిమ్మీ బౌలింగ్‌లో ఆడాల్సి వస్తుందని తెలిసే వారం రోజుల ముందు కాసేపు ప్రాక్టీస్ చేసి వెళ్లాననని చెప్పారు. ఇంకోసారి తనకు ఇంత స్పీడ్‌గా బౌలింగ్ చేయవద్దని సరదాగా అన్నారు. అంతేకాకుండా అక్కడున్న యువ క్రీడాకారులతో ఆయన మాట్లాడారు. సునాక్ ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. చిన్నారుల బౌలింగ్‌లో కూడా సునాక్ నెట్ ప్రాక్టీస్ చేశారు. చిన్నారి వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యారు. తనను ఔట్ చేసిన బాలుడిపై సునాక్ ప్రశంసలు కురిపించారు. బ్యాటింగ్ ఎలా ఉందని ప్రశ్నిస్తే... వీడియో వైరల్‌గా మారడంతో పలువురు బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ యూజర్ ఇంగ్లండ్ క్రికెట్ టీంను ట్విట్టర్‌లో ఆయన బ్యాటింగ్ ఎలా ఉందని ప్రశ్నిస్తే దానికి బదులుగా జట్టు కూడా మరికొన్ని నెట్ ప్రాక్టీస్‌లు అవసరం పడతాయని సరదాగా రిప్లై ఇచ్చింది. అయితే ఇంగ్లండ్‌లోని 9 లక్షల యువ ప్లేయర్స్ కోసం 35 మిలియన్ పౌండ్లు వెచ్చిస్తున్నామని సునాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో కొంత స్టేడియాల్లో ఆల్-వెదర్ డోమ్స్ ఏర్పాటు కోసం వినియోగించనున్నారు. ఇది కూడా చదవండి: శుక్రవారం ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #rishi-sunak #british-prime-minister #cricketer #batting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి