Twist in Delhi liquor case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ లకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా మరో ట్విస్ట్ సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు లంచం తీసుకున్నట్టు తేలింది.
దీంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది.ఇక ఖత్రీతో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ నితేష్ కోహర్, క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్య, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్, అమన్ సింగ్ ధాల్ ప్రవీణ్ కుమార్, బీరేందర్ పాల్ సింగ్ లపై కూడా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
అయితే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీ లిక్కర్ స్కాం కేసులో 5 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వ్యాపారి అమన్ దీప్ నుంచి డబ్బులు తీసుకున్నారని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అమన్ దీప్ నిందితుడిగా ఉన్నారు.
Also Read: బీజేపీ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి వెయ్యి మంది కమలదళం