BREAKING: స్కిల్ కేసులో బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.

TDP : టీడీపీకి భారీ షాక్.. 400 మంది రాజీనామా..!
New Update

Chandra Babu Bail: స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనవచ్చని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.

ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేవరకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. అయితే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఖైదీ గా ఉన్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది న్యాయస్థానం. అనంతరం  చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

అయితే.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.

#ap-news #telugu-latest-news #supreme-court #chandrababu-bail
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe