Rajasthan Elections Polling: ఐదు రాష్ట్రల ఎన్నికలకు గాను ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు పూర్తి అయ్యాయి. తాజాగా ఈరోజు (శనివారం) రాజస్థాన్‌లోని 200 సీట్లలో 199 స్థానాలకుఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లు చేరుకున్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ముగిసింది.
ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!
సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో దాదాపు 68.2 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకారం, సాయంత్రం 5 గంటల వరకు పోఖ్రాన్‌లో అత్యధికంగా 81.12 శాతం పోలింగ్ నమోదైంది, బాగిదౌరా (78.21 శాతం), జైసల్మేర్ (76.57 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో గంగానగర్‌లో 72.09 శాతం ఓటింగ్ జరగగా, రాజధాని జైపూర్‌లో 69.22 శాతం మంది ఓటు వేశారు.
ప్రస్తుతం అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాజస్థాన్ ప్రజలు రాష్ట్ర పగ్గాలను ఇస్తారా? లేదా బీజేపీకి ఇస్తారా? అనేది తెలియాంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాలి.
ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!