TS TET 2024: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా? వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావం రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై పడింది. దీంతో పరీక్షతేదీలు మారాయి. By Bhavana 03 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ts Tet Exam 2024 May Postpone: తెలంగాణలో డీఎస్సీ , టెట్ పరీక్షలను ప్రకటించినప్పటి నుంచి కూడా వాటి నిర్వహణకు అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై పడింది. దీంతో పరీక్షతేదీలు మారాయి.. ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో TS TET 2024 నిర్వహణపై ఆలోచన చేయాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి సీఈవో లేఖ రాశారు. ఓట్లు వేయడానికి ఇబ్బంది లేకుండా TS TET 2024 పరీక్ష నిర్వహణకు వేరే తేదీలను ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. దీంతో తాజాగా విద్యాశాఖ అధికారులు పరీక్ష తేదీలను ప్రకటించారు. మే 25, 26, 27 తేదీల్లో TS TET 2024 పరీక్షలు ఉండవని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. మే 27వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే మే 20 నుంచి జూన్ 3 వరకు తెలంగాణ టెట్ 2024 పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. Also read: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు! పోలింగ్ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులేకావడటంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారో అనే విషయాన్ని పూర్తిస్థాయి షెడ్యూల్ వెల్లడించలేదు. ఎన్నికలు దృష్ట్యా పేపర్ల వారీగా పరీక్షలు నిర్వహించే తేదీలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే కేవలం పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. #telangana #elections #tet #ts-tet-2024 #ts-tet-exam-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి