TET : టెట్ పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలివే!
తెలంగాణలో టెట్ పరీక్షల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. టెట్ పరీక్షలను అధికారులు రీ షెడ్యూల్ చేశారు.
తెలంగాణలో టెట్ పరీక్షల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. టెట్ పరీక్షలను అధికారులు రీ షెడ్యూల్ చేశారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావం రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై పడింది. దీంతో పరీక్షతేదీలు మారాయి.