Health Tips: బక్కగా ఉన్నారని దిగులా? ఈ బ్రెడ్‌తో రెండు వారాల్లో పది కేజీలు గ్యారెంటీ!

సన్నగా, తక్కువ బరువుతో ఉంటే శారీరక సౌందర్యం తగ్గిపోవడంతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉన్నవాళ్లు..కొబ్బరి, బియ్యం, బాదం, క్వినోవా, బుక్వీట్‌ పిండితో చేసిన బ్రెడ్ తింటే ఆరోగ్యమరమైన రీతిలో బరువు పెరుగుతారు.

New Update
Health Tips: బక్కగా ఉన్నారని దిగులా? ఈ బ్రెడ్‌తో రెండు వారాల్లో పది కేజీలు గ్యారెంటీ!

Health Tips: ప్రస్తుత కాలంలో కొందరూ అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు బరువు పెరగటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. వీరిల్లో కొంతమంది సన్నగా, తక్కువ బరువుతో ఉంటారు. సహజంగానే..తక్కువ బరువు ఉండటం వల్ల శారీరక సౌందర్యం తగ్గిపోవడంతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎంతమంచి డైట్ తీసుకున్నా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు పెంచుకోవటలో విఫలం అవుతున్నారు. అయితే.. బరువు తగ్గడం వల్ల కలిగే నష్టాలున్నాయని వైద్యులు అంటున్నారు. తక్కువ బరువు, చాలా సన్నగా ఉంటే.. ఎముక, గుండె సమస్యలతోపాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఫలితంగా రక్తహీనత, అలసిపోయి బలహీనంగా ఉండటం, సులభంగా అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉన్న వాళ్లని ఎగతాళి చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఉంటే బరువు పెరగడానికి ఏమి తినాలి..? అని అందరికి డౌట్‌ వస్తుంది. అయితే..సన్నబడటం వల్ల ఇబ్బంది పడుతుంటే, బరువు పెరగాలని కోరుకుంటే..కొన్ని పిండిని తీసుకోవటం వలన ఆరోగ్యమరమైన రీతిలో బరువు పెరగవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏ పిండి తింటే ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బరువు పెరగడానికి మంచి పిండి ఇదే:

  • కొబ్బరి పిండి, ఎండిన కొబ్బరితో చేసిన పిండిలో ఎక్కువ కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలను పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెంచుతుంది. ఈ పిండిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు వాపును తగ్గించడం, జీవక్రియను పెంచుతుంది.
  • బరువు పెరగాలంటే బియ్యప్పిండి తిన్న మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ అయితే తక్కువ తింటే మంచిది.
  • బాదం పిండిలో మెగ్నీషియం, ఒమేగా-3 అసంతృప్త కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఇ ఉన్నాయి. ఇందులో ప్రొటీన్లు, క్యాలరీలు బరువు పెరగడంతో పాటు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, బిపిని నియంత్రించడానికి ఔషధంలా పనిచేస్తుంది.
  • క్వినోవా పిండిని పిండిని తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోటీన్, ఫైబర్, ఇనుము, అసంతృప్తి కొవ్వుకు ప్రత్యకమైన మూలం.
  • బుక్వీట్ పిండిలో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ వంటి సూక్ష్మపోషకాలున్నాయి. ఇది తింటే బరువు పెరగడమే కాకుండా.. మధుమేహాన్ని నియంత్రించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.  క్యాన్సర్ సమస్యను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ ఫుడ్ నాన్‌వెజ్‌కి ఏ మాత్రం తీసిపోదు.. వెజిటేరియన్స్‌కి బెస్ట్ ఛాయిస్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు