Flight Accident: బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నివాస ప్రాంతంలో కొద్ది సేపటి క్రితం 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. సావో పాలోలోని గౌరుల్ ఎయిర్ పోర్ట్‌కు ఇది వెళుతోంది. వో పాస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ఇది. ఇందులో 58 ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ బ్రెజిల్‌లోని ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సివా ఈ విషయాన్ని ప్రకటించారు. విమానంలో ఉన్నవారందరూ మరణించారని ఆయన తెలిపారు. ఈ ఫ్లైట్ పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని మీద బ్రెజిల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
బ్రెజిల్ ఫ్లైట్ పడిపోవడానికి కారణం దాని మీద మంచు పేరుకుపోవడమే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు అధికారులు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతే మంచు పేరుకుంటుంది. నీటి బిందువులు విమానం రెక్కలు, విండ్ షీల్డ్, ఇంజిన్ వంటి భాగాలపై పడి మంచులా పేరుకుపోతాయి. ఇలాంటప్పుడు ఫ్లైట్‌ను ఆటోపైలట్ మోడ్‌లో పెట్టకూడదు. అలా పెట్టడం వలన ప్రమాదాలు జరుగుతాయి. గతంలో కూడా ఇలా యాక్సిడెంట్లు అయిన సంఘటనలు ఉన్నాయి.ఇప్పుడు బ్రెజిల్ విమానం పడిపోవడనికి కూడా ఇదే కారణం అని చెబుతున్నారు.
అయితే ఇది ప్రాథమిక దర్యాప్తులో తేలింది మాత్రమేనని..కానీ ప్రమాదానికి ఇదొక్కటే కారణం అని చెప్పలేమని అంటున్నారు. దుర్ఘటనకు ముందు పైలట్లు సాయం కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఎలాంటి కాల్ చేయలేదని ఏవియేషన్ అధికారులు చెప్పడం కూడా అనుమానాలకు దారి తీస్తోందని అన్నారు. మరోవైపు ఫ్లైట్ పడిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని పరిశీలించి ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇక అక్కడ ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
Also Read: Arshad Nadim: పాక్ అథ్లెట్ నదీమ్‌కు బహుమతుల వెల్లువ