Flight Accident: బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నివాస ప్రాంతంలో కొద్ది సేపటి క్రితం 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. సావో పాలోలోని గౌరుల్ ఎయిర్ పోర్ట్‌కు ఇది వెళుతోంది. వో పాస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ఇది. ఇందులో 58 ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ బ్రెజిల్‌లోని ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సివా ఈ విషయాన్ని ప్రకటించారు. విమానంలో ఉన్నవారందరూ మరణించారని ఆయన తెలిపారు. ఈ ఫ్లైట్ పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని మీద బ్రెజిల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Brazil: ముంచేసిన మంచు..బ్రెజిల్ విమాన ప్రమాదానికి కారణం?
నిన్న జరిగిన బ్రెజిల్ విమాన ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విమానం మీద మంచు పేరుకుపోవడమే విమాన ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం వలన విమానం మీద మంచు ఏర్పడిందని అధికారులు చెప్పారు.
Translate this News: