Movie Review: హార్రరా? థ్రిల్లరా..మమ్ముట్టి భ్రమయుగం భయపెట్టిందా..

ప్రస్తుతం హర్రర్ సినిమాల కాలం నడుస్తోంది. కొంచెం వెరైటీగా, భయపెట్టేదిగా ఉంటే చాలు సినిమాలు పెద్ద హిట్ అయిపోతున్నాయి. మమ్మట్టి ప్రధాన పాత్రలో నటించిన భ్రమయుగం సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందా..భయపెట్టిందా అంటే సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.

Movie Review: హార్రరా? థ్రిల్లరా..మమ్ముట్టి భ్రమయుగం భయపెట్టిందా..
New Update

Brama Yugam Movie Review: కేరళ సినిమాలు అంటే ఓ క్రేజ్. ఏ మాత్రం బావుంది అని టాక్ వచ్చినా చాలు తెలుగు జనాలు పరుగెడుతున్నారు. అందులోనూ మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్ సినిమాలు అంటే ఇంకా క్రేజ్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమా అక్కడ దుమ్ము రేపుతోంది. ఇక్కడ కూడా అదే భాషలో రిలీజ్ అయింది. జనాలు క్యూలు కట్టారు. దీంతో తెలుగులో డబ్బింగ్ చేసి మన ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో వచ్చిన ఈసినిమా జనాలను ఆకట్టుకుందా...కంటెంట్ ఏంటి? మనవాళ్ళకు ఎక్కుతుందా...అసలు కథేంటీ?

కథ...

17వ శతాబ్దం కథ ఇది. అప్పట్లో పోర్చుగీస్ వారు తక్కువ కులం వారిని బానిసలుగా మార్చి అమ్మేస్తున్న టైమ్. వీరి నుంచి తేవాన్(అర్జున్ అశోక్) అనే గాయకుడు తన ఫ్రెండ్‌తో కలిసి అడవిలోకి పారిపోతాడు. అక్కడ తేవాన్ కళ్ళ ముందే అతని ఫ్రెండ్‌ని ఓ దుష్టశక్తి చంపేస్తుంది. తేవాన్ ఎలాగోలా తప్పించుకుని ఓ పెద్ద భవంతిలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు భవనం యజమాని(మమ్మట్టి) కొడుమోన్ పోటి, రెండవ వాడు వంటవాడు(సిద్ధార్ధ్ భరత్). భవంతిలోకి తేవాన్‌ను ఆహ్వానిస్తారు, ఉండనిస్తారు కూడా. అయితే వెళ్ళిన కొద్దిరోజులకే అతను ఇంటి వెనుక ఉన్న బోలెడు సమాధులను చూస్తాడు. ఇంట్లో క్షుద్రపూజలు చేయడం కూడా గమనిస్తాడు. దీంతో అక్కడి నుంచి తేవాన్ తప్పించుకోవాలని చూస్తాడు. కానీ ఇంటి యజమాని కొడుమోన్ పోటి అతనని వెళ్ళనివ్వడు. బయటకు వెళ్ళిన ప్రతీసారి తిరిగి మళ్ళీ అదే ఇంటికి వచ్చేటట్టు చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో తేవాన్ అక్కడ నుంచి బయటపడగలిగాడా..చివరకు ఏమైంది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది...

హాంటెడ్ హౌస్‌ కాన్సెప్ట్టతో వచ్చిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందే చాలా వచ్చాయి. మంత్రాలు, తాంత్రికశక్తులు, క్షుద్రపూజలకు సంబంధించికూడా చాలా సినిమాలు వచ్చాయి. అయితే భ్రమయుగం వీటన్నింటికంటే ఢిఫరెంట్‌గా ఉంది. ముఖ్యంగా 17వ శతాబ్దంలో కథ నడపటం, బ్లాక్ అండ్ వైట్‌లోనే మొత్తం సినిమా ఉండటం, మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్ ఇలాంటి సినిమా చేయడం భ్రమయుగానికి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. మెయిన్ బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా తీసి సగం భయపెట్టేశాడు దర్శకుడు. ఇందులో కేవలం భయపెట్టడమే కాకుండా, ఒక పాత్ర మీద సానుభూతిని కూడా క్రియేట్ చేశారు. తేవాన్ మమ్ముట్టి నుంచి ఇక తప్పించుకోలేడేమో అని జనాలు కూడా ఫీల్ అయ్యేట్టు చేయగలిగాడు. తేవాన్‌తో పాటూ మనమూ అన్ని ఎమోషన్స్ అనుభవించేటట్టు చేస్తాడు. ఆ పాత్ర తాలూకా భయం, టెన్షన్ మనల్ని కూడా వెంటాడుతూ ఉంటుంది.

సినిమాలో హర్రర్ ఒక్కటే చూపించి వదిలేద్దామనుకోలేదు డైరెక్టర్. తక్కువ కులం, ఎక్కువ కులం కాన్సెప్ట్‌ను కూడా అంతర్లీనంగా చూపించాడు. ఇది ఎప్పటికీ మారదు అనే నిజాన్ని కూడా ఎలివేట్ చేశాడు. కథ కన్నా స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్‌కు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చిన సినిమా భ్రమయుగం. మూవీ నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది. కానీ చూస్తున్న కొద్దీ మన మైండ్‌లోకి ఎక్కేస్తుంది. అందువల్లే ఈ సినిమా హిట్‌ అయింది. తేవాన్ పారిపోకుండా పొట్టి చేసే మాయ‌లు మాత్రం థ్రిల్లింగ్‌ను పంచి సినిమాని చివరిదాకా కూర్చోబెడతాయి. కెమెరాను అటు ఊపి,ఇటు ఊపి, లేదా ఏదో కీ హోల్ లోంచి లేదా గాల్లోంచి చూపెట్టడం వంటివి కాకుండా కొన్ని ప్రత్యేకమైన కట్స్ తో షాట్ మేకింగ్ తో హారర్ ని క్రియేట్ చేసాడు కెమెరామెన్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ప్రాణం పోశాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన క్రిస్టో జేవియర్ భయపెట్టించేశాడు. మనం సినిమాలో లీనమైపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. తేవాన్ అనేది సినిమాలో పాత్ర కాదు మనమే అన్నట్టు ఫీల్ అవుతాము. ఇలాంటి సినిమాలకు డబ్బింగ్ బాగుండడం కూడా చాలా ముఖ్యం. భ్రమయుగం సినిమా విషయంలో అది కూడా బాగా సక్సెస్ అయింది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉండి మూవీ స్లోగా నడుస్తున్నా ఎక్కడా బోర్ కొట్టించదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే మమ్ముట్టిలాంటి పెద్ద హీరో ఇలాంటి పాత్రలు చేయడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. కొడుమోన్ పోటిగా జీవించేశాడు. సినిమా మొత్తం ఒకఏ కాస్ట్యూమ్‌లో కనిపిస్తారు. మమ్ముట్టి తర్వాత ముఖ్య పాత్ర తేవాన్‌గా వేసిన అర్జున్ అశోక్ నటన బావుంది. వంట‌వాడిగా సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి.

Alos Read:Movie Review:కొత్త హీరో, డైరెక్టర్‌ల సిద్ధార్ధ్ రాయ్ సక్సెస్ అయ్యాడా..

#telugu #movie #malayalam #brama-yugam #mammoti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe