High BP: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి

చెడు జీవనశైలి, పనిఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిన అధిక BPని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే రక్తపోటుకు సంకేతం.

Health Tips : బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!!
New Update

High BP: ప్రస్తుత రోజుల్లో చెడు జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు సమస్య పెరుగుతోంది. అంతేకాకుండా వయస్సు, ఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల కూడా అధిక BP కనిపిస్తుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు.

రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయా?

  • అధిక రక్తపోటు సంకేతాలు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు. సకాలంలో చికిత్స చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రాత్రిపూట తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటే లేదా నొప్పి అలాగే కొనసాగితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటుకు సంకేతం.

నిద్రలేమి:

  • రాత్రి సమయంలో మంచి నిద్ర లేకపోయినా అది అధిక రక్తపోటుకు సంకేతమని వైద్యులు అంటున్నారు.

తరచూ మూత్ర విసర్జన:

  • అధిక రక్తపోటు కారణంగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు వల్ల రక్త నాళాలపై ఒత్తిడి ఉంటుంది. ఇది మూత్రపిండాలను ప్రభావితం చేయడంతో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు.

విపరీతమైన అలసట:

  • కారణం లేకుండా అలసటగా అనిపించడం లేదా చిన్నపాటి పని చేసినా అలసిపోవడం, బలహీనంగా అనిపిస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చని వైద్యులు అంటున్నారు. దీని కారణంగా గుండె దెబ్బతింటుందని, కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

ఉన్నట్టుండి శ్వాస ఆడకపోవడం అధిక రక్తపోటుకు సంకేతం. శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: వెజిటేబుల్‌ బిర్యానీ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  ఖాళీ కడుపుతో పసుపులో నెయ్యి కలిపి తింటే కలిగే ప్రయోజనాలు

#health-benefits #high-bp #night #symptoms
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe