Boora Narsaiah Goud: బీజెపీ డ్యామేజీ కంట్రోల్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే బీసీ లకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ (BJP) ఇక మునుగోడు (Munugode) లో బీసీ లు బలంగా ఉండటం తో బూర ని రంగం లోకి దింపాలని భావిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో మునుగోడు నుంచి బూన నర్సయ్యను పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తోంది. 2014లో భువనగిరి ఎంపీ గా రాజగోపాల్ రెడ్డి ని ఓడించిన రికార్డ్ బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) కి ఉంది. అయితే బూర ఇప్పుడు మునుగోడు అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ అసెంబ్లీకే పోటీ చేయాలనుకున్నా అతని మొదటి ఛాన్స్ ఇబ్రహీంపట్నం. కానీ అక్కడ నోముల దయానంద్ గౌడ్ కి బీజేపీ టికెట్ ప్రకటించింది.దీంతో బూర ఇక భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనీ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతుండటం తో పరిణామాలు మారుతున్నాయి. మరి బూరను ఒప్పించడానికి ఎవరు దిగుతారో...ఎలా బుజ్జగిస్తారో చూడాలి.
Also Read:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీని వీడడం దాదాపు ఖయమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రచారం జోరుగా సాగుతున్నా.. ఆయన ఎక్కడా ఖండిచలేదు. అంతే కాకుండా.. కాంగ్రెస్ నుంచి మునుగోడులో (Munugode) పోటీ చేయాలని తనపై కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందంటూ.. తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ మారడం కన్ఫామ్ అయిందని తెలుస్తోంది. ఈ నెల 25న రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ (Congress) వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.