Sridevi death:శ్రీదేవిది సహజ మరణం కాదు- ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ కపూర్

అందాల తార, జగదేక సుందరి శ్రీదేవి హఠటాత్తుగా మరణించడం అందరినీ తీవ్రంగా కలిచేసింది. ఆమె అకాల మరణం వినోద పరిశ్రమనే కాకుండా యావత్ దేశాన్ని తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురి చేసింది. అనూహ్యంగా శ్రీదేవి చనిపోవడం, అది కూడా అసహజంగా అవడంతో ఆమె మరణం మీద చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను కూడా అనుమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి మౌనంగా ఉంటూన్న బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య మరణం గురించి నోరు విప్పారు. తనది సహజమరణం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Sridevi death:శ్రీదేవిది సహజ మరణం కాదు- ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ కపూర్

Boney Kapoor Reveals about Sridevi's death: ప్రముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ చాలా విష‌యాల్ని మాట్లాడారు. తన భార్య శ్రీదేవి మరణం విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఇది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు సంభ‌వించిన‌ మరణం. నేను దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను.. ఎందుకంటే నేను దర్యాప్తు విచారణలో దాదాపు 24 లేదా 48 గంటల పాటు దాని గురించి మాట్లాడాను. అందుకే తరువాత ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు అని చెప్పుకొచ్చారు బోనీ కపూర్. భారతీయ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉన్నందువల్లనే విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారు. అయితే చివరకు తాను చేసిందేమీ లేదని శ్రీదేవి ప్రమాదవశాత్తు మాత్రమే చనిపోయిందని తేల్చారని బోనీ అన్నారు.

శ్రీదేవి (Sridevi) తన ఫిజిక్ ను కాపాడుకోవడం మీద చాలా శ్రద్ధ పెట్టేది. తరచుగా ఆకలితో అలమటించేది. డైట్ (Diet) లో భాగంగా చాలా తక్కువ ఆహారం తీసుకునేది. అందంగా కనిపించాలని కోరుకునేది. త‌ను మంచి ఆకృతిలో ఉండాల‌ని ప్రయత్నించేది. దాని కోసం ఉప్పూ, కారాలు లేని ఫుడ్ తీసుకునేది. చాలఆ సార్లు లో బీపీ వల్ల కళ్ళు తిరిగిపడిపోయేది కూడా. అంతేకాదు శ్రీ‌దేవితో నాకు పెళ్లయినప్పటికే ఆమెకు రెండు బ్లాక్‌అవుట్‌లు ఉన్నాయి. శ్రీదేవి చనిపోయిన తర్వాత నాగార్జున కలిశారు. అప్పుడు ఆయన కూడా అదే విషయాన్ని చెప్పారు. తనతో సినిమా చూస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో కూడా రెండు, మూడు సార్లు కళ్ళు తిరిగిపడిపోయిందని చెప్పారు.

శ్రీదేవి 2018లో చనిపోయింది. దుబాయ్ (Dubai) లోని ఓ హోటల్లో బాత్ టబ్ లో పడి మరణించింది. భర్త బోనీ కపూర్ తో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు అటెండ్ అయినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. దుబాయ్ బయలుదేరుతున్నప్పుడే ఆమెకు ఒంట్లో బాలేదని బోనీ కపూర్ చెప్పారు. అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా డైట్ పాలో అవడం లాంటివి చేసిందని ఆయన తెలిపారు. అందుకే బాత్ టబ్ లో కళ్ళు తిరిగి పడిపోయిందని అన్నారు. శ్రీదేవి చివరి సినిమా మామ్ (MOM). దీనికి గానూ ఆమె ఉత్తమ జాతీయ నటి అవార్డును కూడా గెలుచుకుంది.

ఇది కూడా చదవండి:నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ చేరిన టీమ్ ఇండియా

ఈ ఫుడ్స్ ను ఉదయాన్నే తింటే.. అస్సలు బరువు తగ్గరు..!!

Advertisment
తాజా కథనాలు