Ananth Ambani Wedding: అంబానీ పెళ్లి వేడుకలో బాంబు బెదిరింపు.. నిందితుడు ఎవరంటే ?

రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మార్చంట్‌ల వివాహ వేడుకలో బాంబు పేలబోతుందంటూ ఓ దుండగుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌గా గుర్తించారు.

New Update
Ananth Ambani Wedding: అంబానీ పెళ్లి వేడుకలో బాంబు బెదిరింపు.. నిందితుడు ఎవరంటే ?

రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మార్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వేడుకలో బాంబ్‌ పేలబోతుందని సోషల్ మీడియాలో ఓ దుండుగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబానీ - రాధికల పెళ్లికి ఒక రోజుకు ముందు.. వివాహ వేడుకలో బాంబు పేలనుంది అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరలయ్యింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వేడుక జరగడానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. చివరికి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Also read: పూరీ జగన్నాధుని రత్నభాండాగారం కింద మరో నిధుల గది.. కొత్త విషయం వెలుగులోకి  

అయితే గుజరాత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జులై 12 న అంబానీ - రాధిక మార్చంట్‌ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. దేశవిదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా బాంబు బెదిరింపు రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

Also read: వరదలతో వణుకుతున్న ఉత్తరప్రదేశ్.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు