UP Floods: ఉత్తరభారతావని వరదలతో అతలాకుతలం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని 20 జిల్లాల్లో వరదల పరిస్థితి నెలకొంది. నేపాల్ సరిహద్దులోని నదులతో పాటు గంగా నది కూడా ఉప్పొంగుతోంది. వారణాసిలో గంగానది నీటిమట్టం ప్రతి గంటకు 5-10 సెంటీమీటర్ల మేర పెరుగుతోంది. గోరఖ్‌పూర్‌లో రప్తీ నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. 30 గ్రామాలు నీట మునిగాయి. వరద పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా సోమవారం సీఎం యోగితో చర్చించారు. మరోవైపు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు కొనసాగుతున్నాయి. ముజఫర్‌పూర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. కత్రా బ్లాక్‌లో బాగ్మతి, లఖండేయ్ నదులు ఉప్పొంగుతున్నాయి. బకుచి, పటారి, అండమా, బస్‌ఘట్ట, నవాడ, గంగేయ తదితర 50 వేలకు పైగా గ్రామాల జనాభా వరద నీటితో చుట్టుముట్టింది.
పూర్తిగా చదవండి..UP Floods: వరదలతో వణుకుతున్న ఉత్తరప్రదేశ్.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు!
దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంగానది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. రాబోయే రెండు మూడురోజుల వరకూ దాదాపుగా దేశం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది
Translate this News: