Bomb Threat : జమ్మూ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు

జమ్మూ – జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దారి మధ్యలో ఉండగ ఈ ట్రైన్‌లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.

Bomb Threat : జమ్మూ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు
New Update

Jammu- Jodhpur Train: జమ్మూ – జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 19926 నంబర్‌ గల ఎక్స్‌ప్రెస్‌ రైలు జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సమీపంలోకి రాగానే ట్రైన్‌లో బాంబు పెట్టినట్లు కొందరు వ్యక్తులు పోలీసులకు ఫోన్‌ ద్వారా బెదిరించారు. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే రైలును కాసు బేగు స్టేషన్‌లో నిలిపివేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, భద్రతా బలగాలు డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాలతో రైలు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులూ, పేలుడు పదార్థాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రిజిస్టరైన మొబైల్‌ నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: TGPSC: జనవరిలో సీడీపీవో, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్

#train #jammu #bomb #jodhpur #threat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe