Actor Sahil Khan Arrested in Mahadev Betting App Case: మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో తవ్విన కొద్ది నిందితులు బయటికి వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గడ్‌లో ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సిట్ సాహిల్.. అతడిని కస్టడీలోకి తీసుకుంది. సాహిల్ ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ 2023 డిసెంబర్‌లోనే సాహిల్ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది. అయినప్పట్టికీ అతడు హాజరు కాలేదు.
Also Read: మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు: సిద్ధరామయ్య
బెయిల్ నిరాకరణ
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇటీవల సాహిల్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తాను సెలబ్రిటీ కావడం వల్లే యాప్‌కు బ్రాండ్ ప్రమోటర్‌గా పనిచేశానని చెప్పారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో చెప్పాడు. కానీ, పోలీసులు మాత్రం అతడు బెట్టింగ్ యాప్ సహ-యజమానిగా చెప్పుకొచ్చారు. సాహిల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెట్టింగ్ యాప్‌లో అక్రమం జరిగిందని.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని పేర్కొంది. ఫేక్ బ్యాంకు ఖాతాలను సృష్టించి.. నకిలీ సిమ్ కార్డులో సంప్రదింపులు చేసినట్లు గుర్తించారు.
మొత్తం 15 కోట్ల అవినీతి..
పిటిషన్‌దారుకు 'ది లయన్ బుక్247'తో నేరుగా సంబంధం ఉందని ధర్మాసనం తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే పలు బాలివుడ్ చిత్రాల్లో నటించిన సాహిల్ ఖాన్.. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు సొంతంగా ఓ కంపెనీ ఏర్పాటు చేసుకోని ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.15 వేల కోట్లు అవినీతి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) గుర్తించింది.
67 బెట్టింగ్ వెబ్‌సైట్లు..
దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లు సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్‌పత్తీతో పాటు మరికొన్ని గేమ్స్‌లో బెట్టింగ్/గ్యాంబ్లింగ్ చేసినట్లు తెలిపారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించినట్లు ఆరోపించారు. అయితే దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ గతంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. 2023 నవంబర్‌లో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను గత ఏడాదే దుబాయ్‌లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Also read: మరో నల్లజాతీయుడిపై పోలీసుల కర్కశత్వం.. ఊపిరాడక బాధితుడు మృతి