Aamir Khan : ఆ సినిమా ప్లాప్ కు నేనే కారణం.. ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ కి తానే కారణమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాను 'ఫారెస్ట్‌ గంప్‌' కి రీమేక్‌గా రూపొందించాం.అందులో టామ్‌ హాంక్స్‌ అద్భుతంగా నటించారు.కానీ నా నటన ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అందుకే హిట్‌ కాలేదని అన్నారు.

New Update
Aamir Khan : ఆ సినిమా ప్లాప్ కు నేనే కారణం.. ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Bollywood Actor Aamir Khan : బాలీవుడ్ (Bollywood) అగ్ర హీరో ఆమీర్ ఖాన్ (Aamir Khan) రెండేళ్ల క్రితం నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో పరాజయం పొందిన విషయం తెలిసిందే. 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మన టాలీవుడ్ (Tollywood) హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) సైతం గెస్ట్ రోల్ లో కనిపించాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి నేనే కారణం అంటున్నారు ఆమీర్ ఖాన్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘లాల్‌సింగ్‌ చద్దా’ పరాజయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మేరకు ఆమీర్ మాట్లాడుతూ.." ఈ సినిమాను 'ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా రూపొందించిన విషయం తెలిసిందే. అందులో టామ్‌ హాంక్స్‌ చాలా అద్భుతంగా నటించారు. ఇది సాధారణ కథ అయినప్పటికీ..టామ్‌ నటన అందరినీ ఆకర్షించింది.

Also Read : నారా రోహిత్ ‘సుందరకాండ’.. నవ్వులు పూయించిన టీజర్

నేను ఆయనలా కాకుండా ‘లాల్‌సింగ్‌ చద్దా’లో ఇంకాస్త ఎక్కువగా నటించాను. నా అంచనాల ప్రకారం... ఇందులో నా నటన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే హిట్‌ కాలేదు. నేను ఈ సినిమాలో చేసిన తప్పుల వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. నా రాబోయే చిత్రంలో మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా మరింత మెరుగ్గా నటించాలని నిర్ణయించుకున్నా" అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు