Sundarakanda: నారా రోహిత్ 'సుందరకాండ'.. నవ్వులు పూయించిన టీజర్

హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సుందరకాండ'. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో హీరో పాత్ర, కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

New Update
Sundarakanda: నారా రోహిత్ 'సుందరకాండ'.. నవ్వులు పూయించిన టీజర్

Sundarakanda: టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) రీసెంట్ గా 'ప్రతినిధి2' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 'ప్రతినిధి2' లో ఫుల్ యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించిన రోహిత్.. ఇప్పుడు సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) దర్శకత్వంలో నారా రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సుందరకాండ'. సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ బ్యానర్ పై రాకేష్‌ మహంకాళి, చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వృతి వాఘని కథానాయికగా నటిస్తోంది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుందరకాండ టీజర్

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో హీరో పాత్ర, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి నేను హ్యాపీగా ఉండను' అనే డైలాగ్ సినిమాలో హీరో జీవితం ఎలా ఉండబోతుందో తెలిపేలా ఉంది. ఏజ్ ఎంత అంటే.. జుట్టుకు రంగు వేసుకునే అంతా అంటూ టీజర్ లో వినిపించిన కొన్ని డైలాగ్స్ నవ్వులు పూయించాయి. ఈ చిత్రంలో VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి , సునైనా , రఘు బాబు , అమృతం వాసు , అదుర్స్ రఘు, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్ తదితరులు కీలక పత్రాలు పోషించారు.

Also Read: Mufasa Trailer: ‘ముఫాసా’కు మహేష్ బాబు వాయిస్ ఓవర్..! ట్రైలర్ అదిరింది - Rtvlive.com 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు