Indresh Malik: తల్లి ముందే నటితో రొమాన్స్.. భయంగానే అక్కడ టచ్ చేశానన్న నటుడు!

‘హీరామండి’ సినిమాలో సోనాక్షి సిన్హాతో తెరకెక్కించిన సన్నిహిత సన్నివేశం చేయాలంటే చాలా భయమేసిందని ఇంద్రేష్ మాలిక్ అన్నాడు. ముఖ్యంగా సోనాక్షి తల్లి పూనమ్ ముందు సోనాను ముట్టుకోలేకపోయానన్నాడు. అయితే తల్లీ కూతుళ్లు ఇద్దరూ తనను ప్రోత్సహించారంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

New Update
Indresh Malik: తల్లి ముందే నటితో రొమాన్స్.. భయంగానే అక్కడ టచ్ చేశానన్న నటుడు!

Heeramandi: స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘హీరామండి’ సినిమా భారీ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓ పురాన కథతో రూపొందించిన చిత్రంలో నటీనటుల మధ్య సన్నిహిత సంబంధాలను కూడా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ఇంటిమేటెడ్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డానని నటుడు ఇంద్రేష్ మాలిక్ రీసెంట్ ఇంటర్వ్యూలో బయపెట్టాడు.

కొంచెం సిగ్గు పడ్డాను..
ఈ మూవీలో సోనాక్షి సిన్హా, మనీషా కోయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్దా, షర్మిన్ సైగల్, సంజీదా షేక్ వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. నటుడు ఇంద్రేష్ మాలిక్ కూడా ఓ పాత్రలో నటించి మెప్పించగా.. షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వెల్లడించాడు. ‘సోనాక్షితో ఇంటిమేట్ సీన్ భయంగా అనిపించింది. షూటింగ్ సమయంలో చాలా ఆందోళన చెందాను. కొంచెం సిగ్గు పడ్డాను. అయితే సోనాక్షి నా దగ్గరకు రిలాక్స్‌గా చేయాలని ధైర్యం చెప్పింది’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Ranveer-Deepika divorce: రణ్ వీర్-దీపిక విడాకులు.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటుడు!

ఇక ‘షూట్ చేసేటప్పుడు సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఈ కథకు ఆ సీన్ చాలా అవసరం కాబట్టి మీరు కంగారు పడకండి అని ఆమె నాతో అన్నారు. అయితే ఒక గంట మొత్తం చర్చించి షూటింగ్ కంప్లీట్ చేశాం. అలాగే సోనాక్షి నా తలను ఆమె కాళ్లను టచ్ చేసే సీన్ కూడా ఎంతో భయంగా చేశాను. అప్పుడు పూనమ్ సిన్హా నా దగ్గరకు వచ్చి నాకు ధైర్యం చెప్పి మరీ దగ్గరుండి చేయించారు. హీరామండిలోని నా పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించానని అనుకుంటున్నా’ అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు