Kitchen Tips: పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. మన ఎముకలు, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఉండే క్యాల్షియం, పోషకాలు శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. దీన్ని మరిగించాలనికి సరైన మార్గం చాలామందికి తెలియదు. కొన్ని పొరపాటు వల్ల శరీరానికి పాలు పూర్తి ప్రయోజనం లభించక చాలాసార్లు పాలు కాచాల్సి వస్తుంది. చాలా మంది పాలను చిక్కగా చేయడానికి ఎక్కువసేపు మరిగిస్తారు. ఆ సమయంలో.. కొందరు వ్యక్తులు పదేపదే పాలు కాచడాన్ని తప్పు చేస్తారు. అంతేకాదు..కొందరు పాలు మరటం ప్రారంభించిన తర్వాత గ్యాస్‌ను నెమ్మదిగా పెట్టి ఎక్కువసేపు మరిగిస్తారు. పాలల్లో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు అనేక రకాల ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇది శరీరానికి పోషణను అందిస్తుంది. పాలు తాగడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. కానీ పాలు కాచేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఇవి అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ఎన్నిసార్లు మరిగించాలో తెలియని వారు ఎక్కువగానే ఉన్నారు. పాలను మరిగించడానికి సరైన మార్గం తెలియని వారికోసం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పాలు మరిగించే విధానం:
- పాలను ఎక్కువ సేపు మరిగిచటం, లేదా పదే పదే మరిగించడం వల్ల పోషకాలు నాశనం అవుతాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల శరీరానికి పాల వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు అందవు. పాలను కాచడానికి సరైన విధానం ఏమిటంటే..పాలను మంట మీద ఉంచిన తర్వాత ఒక చెంచా, గరిటెతో నిరంతరం కదిలిస్తూ ఉండాలి. పాలు మరటం మొదలైనప్పుడు గ్యాస్‌ను ఆపివేయాలి. పాలు మరిగిన తర్వాత.. మళ్లీ మళ్లీ మరిగించడం తప్పు కాదు. పాలను మరిగించే ప్రతిసారీ దానిలోని పోషకాలు నాశనం అవుతాయని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. పాలు చెడిపోతాయని అనిపిస్తే మరోసారి మరిగించవచ్చని చెబుతున్నారు.
ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి:
- ఆహారం తిన్న తర్వాత పాలు తాగితే వారు సగం కడుపుతో మాత్రమే పాలు తాగాలి. లేకపోతే జీర్ణక్రియ చెడిపోవచ్చని వైద్యులు అంటున్నారు. బెండకాయలు, ఉల్లిపాయలు తిన్నప్పుడు పాలు తాగవద్దు. ఎందుకంటే చర్మ వ్యాధులు వస్తాయి. చేపలు, నాన్‌వెజ్‌తో పాలు ఎప్పుడూ త్రాగవద్దు. ఇది చర్మంపై తెల్లటి మచ్చలు, ల్యూకోడెర్మాకు కారణం కావచ్చు. భోజనం చేసిన వెంటనే పాలు తాగకూడదు. ఇది కడుపులో భారం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.పాలతో ఉప్పు పదార్థాలకు దూరం ఉంటే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు
ఇది కూడా చదవండి: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్ డేంజర్‌లో పడినట్టే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.