Chennai:అమ్మో బాంబు..చెన్నైలో పాఠశాలలకు బెదిరింపులు

తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్ళకు ఈ మెయిల్స్ పంపించి బాంబులు పెట్టామని బెదిరించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి పరుగులు తీశారు.

New Update
Chennai:అమ్మో బాంబు..చెన్నైలో పాఠశాలలకు బెదిరింపులు

Bomb thretaning to schools:చెన్నైలో పిల్లల తల్లిదండ్రులు భయంతో సూళ్ళకు పరుగులు పెట్టారు. చెన్నైలో ఐదు స్కూళ్ళకు బాంబుల బదిరింపులు రావడం కలకలం రేపింది. అక్కడ గోపాలపురం, జేజే నగర్, ఆర్ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని సూళ్ళకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపు లేఖలు వచ్చాయి. దీంతో తమ పిల్లలను సూళ్లనుంచి తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు ఇమ్మీడియట్‌గా చేరుకున్నారు. పాఠశాలలకు కూడా వెంటనే సెలవును ప్రకటించారు. తరువాత పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే స్కూళ్లకు చేరుకున్న పోలీసులు...

స్కూల్ నుంచి సమాచారం అందుకున్ నపోలీసులు వెంటనే రంగంగలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్ , జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్ధాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదు. దీని మీద దర్యాప్తు చేస్తున్నామని చెన్నై పోలీసులు చెబుతున్నారు. ఐదు స్కూళ్ళకు ఒకే వ్యక్తి దగ్గర నుంచి బాంబు బెదిరింపు లేఖలు వచ్చాయని...అతనెవరో కనిపట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈరోజు యాజమాన్యం స్కూళ్ళకు సెలవులు ప్రకటించాయి. దీన్ని మరొక రోజు కూడా పొడిగించే అవకాశం ఉంది.

గతంలో బెంగళూరులో కూడా ఇదే తరహా బెదరింపులు...

అంతకు ముందు బెంగళూరులో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. బెంగళూరులో ఒకేసారి 44 స్కూళ్ళకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అన్ని స్కూల్స్‌కీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్ళ యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే విద్యార్ధులను ఇంటికి పంపించేశాయి. ముందుగా ఏడు స్కూల్స్‌కి బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్‌నగర్‌లోని రెండు పాఠశాలల యాజమాన్యాలు ఈ బెదిరింపులతో వణికిపోయాయి. కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి ముందు ఉన్న స్కూల్‌కీ ఇవే బెదిరింపులు రావడం మరింత ఆందోళన కలిగించింది. అయితే తరువాత అవి కేవలం బెదిరించడానికి మాత్రమే ఈమెయిల్స్ పంపిచారని పోలీసులు తేల్చారు.

Also Read:Andhra pradesh:ఈరోజు ఢిల్లీకి పవన్ కల్యాణ్…పొత్తు ఖరారయినట్లేనా!

Advertisment
తాజా కథనాలు