/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/WhatsApp-Image-2024-09-02-at-7.57.15-PM-1.jpeg)
భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మొత్తం నీటమునిగింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలు ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. అపార్ట్‌మెంట్‌లలో మొదటి ఫ్లోర్ వరకు నీరు చేరింది. ఇలా ముంపు ప్రాంvతాలకు గురైన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు కక్కుర్తి గాళ్లు బోట్ల దందా మొదలుపెట్టారు. వరదల వల్ల ఇంత ప్రళయం జరిగినా కూడా దాన్ని ఆసరగా చేసుకోని బోట్ల యజమానులు జనాల వద్ద డబ్బులు దండుకున్నారు. బోటు ప్రయాణానికి రూ.1500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు.
విజయవాడ వరదల్లో బోట్ల దందా..
రూ.1500 నుండి రూ.4000 వరకు వసూలు చేస్తున్న బోట్ల యజమానులు.#AndhraPradeshRains #VijayawadaFloods #HeavyRains #boats #rtvnews #RTV pic.twitter.com/BtZTXmxoH3
— RTV (@RTVnewsnetwork) September 2, 2024