Watch Video : స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో అరుదైన దృశ్యం..

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. అకస్మాత్తుగా ఇలా జరిగిన ఘటనను చూసి ప్రజలు అవాక్కైపోతున్నారు.

Watch Video : స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో అరుదైన దృశ్యం..
New Update

Blue Meteor Lights : స్పెయిన్ (Spain), పోర్చుగల్‌ (Portugal) గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ ఉల్క వల్ల వచ్చిన వెలుగు పగలను తలపించింది. అకస్మాత్తుగా ఇలా జరిగిన ఘటనను చూసి ప్రజలు అవాక్కైపోతున్నారు. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఈ వెలుగు కనిపించిందని వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ఉల్కా (Meteorite) భూమిపై ఎక్కడ పడిందో అనే దానిపై క్లారిటీ లేదు.

Also read: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

అయితే ఇది క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు కొంత ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతున్నాయి. ఇదిలాఉండగా.. 2013లో కూడా రష్యాలో చెల్యాబిన్స్క్‌ అనే ప్రాంతంలో ఇంతకంటే భారీ స్థాయిలో ఉల్కలు పడ్డాయి. అప్పట్లో అలాంటి ఉల్కలు భారీగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అన్నారు. అది ఏకంగా 500 కిలో టన్నుల టీఎన్‌టీకి సమానమైన శక్తిని విడుదల చేసినట్లు అంచనా వేశారు.

Also read: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 26 వేల కేసులు

#spain #blue-meteor #portugal #meteorite
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe