Delhi High court : భర్తలపై నిందలుమోపే భార్యలకు షాక్.. ఇకపై ఆటలు చెల్లవు

భర్తలపై తప్పుడు ఆరోపణలు చేసే భార్యలకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అత్తవారింట్లో ఆహారం పెట్టట్లేదని, టానిక్‌ పేరిట దోమల మందు తాగించారని ఓ ఇల్లాలు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంట్లోలేని భర్తలపై నిందలు మోపడం క్రూరత్వ చర్యలుగా పేర్కొంది.

New Update
Delhi High court : భర్తలపై నిందలుమోపే భార్యలకు షాక్.. ఇకపై ఆటలు చెల్లవు

Delhi High court :భర్తలపై నిందలు మోపే భార్యలకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏ కారణం లేకుండానే కక్షతో హస్బెండ్ ను అబాసుపాలు చేసే ఇల్లాలి ఆటలు ఇక చెల్లవంటూ సంచలన తీర్పు వెల్లడించింది. ఇకపై అలాంటిచర్యలు క్రూరత్వంగా పేర్కొనబడతాయని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ విషయంలో బంధువులు, ఇల్లాలి పేరెంట్స్ ఆరోపణలు కూడా ఆధారంలేకుండా పరిగణలోకి తీసుకోవడం కుదరదని, తప్పుడు కేసులకింద పరిగణిస్తామని పేర్కొంది.

భార్య క్రూరత్వ చర్యలే..
ఈ మేరకు భర్త విడాకుల మంజూరును సవాల్‌ చేస్తూ ఓ ఇల్లాలు దాఖలు పిటిచేసిన షన్ పై విచారణ జరిపిన ఢిల్లీ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. అత్తవారింట్లో తనకు సరైన ఆహారం పెట్టట్లేదని, టానిక్‌ పేరిట దోమల మందును తాగించారని భార్య విడాకుల మంజూరును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. భర్తపై నిందలు మోపడం భార్య క్రూరత్వ చర్యలేనని తెలిపింది. 'బలవన్మరణానికి ప్రయత్నించి ఆ నిందను భర్త, అతని పేరెంట్స్ లేదా కుటుంబ సభ్యులపై నెట్టివేయాలని చూడడం వంటివి భార్య క్రూరత్వ చర్యలే. వాళ్లపై తప్పుడు కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడటం, కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేయడం కూడా క్రూరత్వమేనని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌, జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో భర్తకు విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు!

భర్త పరిస్థితి ఏమిటి?
ఇక ఈ కేసులో ఆమె ఆత్మ హత్యకు పాల్పడాలనుకన్న సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడని, పూర్తి విచారణలో ఆఫీసులో ఉన్నట్లు ఆమె అంగీకరించినట్లు హైకోర్టు తెలిపింది. అలాగే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న భార్యలు.. ఆత్మహత్యాయత్నంలో అనుకోకుండా చనిపోతే భర్త పరిస్థితి ఏమిటి? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలాంటి ఫెక్ కంప్లైట్స్ తో పురుషుల జీవితాలతో ఆడుకోవడం సరైనది కాదని చురకలంటించింది.

Advertisment
తాజా కథనాలు