ఒడిశాలో ఈసారి అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అక్కడి అధికార బీజేడీకి చెక్ పడింది. ఎన్నో ఏళ్ళుగా నిలబెట్టుకొస్తున్న అధికారాన్ని బీజేపీ లాగేసుకుంది. ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళుతోంది.మొత్తం స్థానాల్లో బీజేపీ 77 చోట్ల లీడ్‌లో ఉంది. అది కూడా వేల సంఖ్యలో ఓట్లలో దూసుకుపోతోంది. ఇక, అధికార పార్టీ బీజేడీ మాత్రం కేవలం 51 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. అది కూడా స్వల్పంగా ఉండడం తో ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
25 ఏళ్ళుగా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కే ఒడిశా ప్రజలు పట్టం కట్టారు. కానీ ఈసారి మాత్రం ఆయన నెగ్గురాలేకపోయారు. దానికి ప్రధానం కారణం ఆయన అనారోగ్యం. దాదాపు రెండేళ్ళుగా నవీన్ పట్నాయక్ సీఎంగా చురుగ్గా లేరు. మాజీ ఐఏఎస్ పాండ్యన్ కు దాదాపు అధికారాన్ని అప్పగించి.. చివరి రెండు సంవత్సరాలు కూడా.. నవీన్ యాక్టింగ్ సీఎంగానే వ్యవహరించారు. దీన్ని బీజేపీ ఒడిసి పట్టుకుంది. తమ ప్రచారంలో ఈ విషయాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకుంది. దీని తోడు పాతికేళ్ళల్లో ఒడిశాలో పెద్దగా అభివీద్ధి జరగలేదు. దీన్ని కూడా బీజేపీ ప్రచారంలో వాడేసుకుంది. మరోవైపు పూరీ జగన్నాథ్ ఆలయ గొడవలు లాంటివికూడా బీజేడీ మీద ఒడిశా ప్రజలకు వ్యతిరేకతను పెంచాయి.
బీజేడీ లూప్ హోల్స్‌ను పట్టుకోవడంలో అక్కడి కాంగ్రెస్ విఫలం అయింది. బీజేపీ మాత్రం చాలా తెలివిగా అన్నింటిని వీడుకుని ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ సైతం ఒడిశా పర్యటన చేశారు. దీంతో బీజేడీ పాతికేళ్ళ ప్రస్తానానికి తెర పడింది. ఒడిశాలో తరువాతి ప్రభుత్వంగా బీజేపీ అవతరించనుంది.