Electoral Bonds Scheme: బీజేపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ అది పునరుద్దరిస్తాం: నిర్మలా సీతారామన్

ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్రునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని కేంద్రమంతి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

New Update
Nirmala Sitharaman: ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి కేజ్రీవాల్ కారణం.. నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామంటూ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ' సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని మళ్లీ అధికారంలోకి వస్తే తిరిగి తీసుకొస్తామని కేంద్రమంత్రి సీతారమన్ అన్నారు. 'పే పీఎం స్కామ్' కింద బీజేపీకి రూ.4 లక్షల కోట్లు దోచుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ దోపిడీని కొనసాగించాలనుకుంటున్నారు. ఈసారి ఎంత దోచుకుంటారో ?. అందుకే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఈ అవినీతి దళం బయటకు వెళ్తుందని పలు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయని' కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.

Also Read: నాగలాండ్‌లోని ఆ ప్రాంతంలో సున్నా శాతం ఓటింగ్.. కారణం ?

ఇదిలాఉండగా.. రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని.. తక్షణమే ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు నిలిపివేయాలని ఆదేశించింది. ఎలాంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని తెలిపింది. విరాళాలు ఇచ్చినవారి పేర్లు రహస్యంగా ఉంచడం సరైంది కాదని.. ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని సైతం ఉల్లంఘించినట్లు అవతుందని చెప్పింది. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజల నుంచి కూడా బీజేపీ విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను తిరిగి తీసుకొస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

Also read: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

Advertisment
తాజా కథనాలు