National: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం మీద విపక్షనేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ భయం పోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం తో కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు.

New Update
National: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్

Rahul Gandhi: దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 10చోట్ల విపక్షమైన ఇండియా కూటమి విజయం సాధించగా..బీజేపీ కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఒకచోట స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఈ విజయం మీద కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హర్ష్ వ్యక్తంచేశారు.

అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో విజయంతో ఇండియా కూటమి ఏతలు సంబరాలు చేసుకున్నారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసెంబ్లీ ఉపఎన్నికల్లో భారత కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ఇక మీదట దేశంలో బీజేపీ మీద ఉన్న భయం పోయిందని రాహుల్ అన్నారు. భారత ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. దేశంలోని అణగారిన పేద జనాభా వారి హక్కులను కాపాడుకోవడానికి భారతదేశంతో పాటు నిలిచారని తెలిపారు. దాంతో పాటూ తమను గెలిపించిన దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:Himachal Pradesh: హిమాచల్ ఉపఎన్నికల్లో సీఎం భార్య విజయం

Advertisment
Advertisment
తాజా కథనాలు