National: కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే.. మోదీ ప్రధానిగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంలో కీలక పదవుల బాధ్యత బీజేపీ సీనియర్ నేతలకే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇంతుకు ముందులాగే అమిత్ షా, రాజ్‌సాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు తమ మంత్రిత్వశాఖల్లో కొనసాగుతారని సమాచారం. By Manogna alamuru 09 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Modi 3.0 Cabinet: మోడీ 3.0 టీమ్ ఎలా ఉండబోతోంది అనే దాని చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచబోతోంది. టీడీపీ, జేడీయూలతో కలిసి సంయక్తంగా పాలన సాగించనుంది. దీంతో ఎవరెవరికి ఏఏ పదవులు ఇస్తారు అనే దాని మీద అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే దక్కనున్నాయి అని తెలుస్తోంది. టీడీపీ, జేడీయూలకు ఒక్కోటి ఇస్తారని చెబుతున్నారు. ఇంతకు ముందులాగే హోంమత్రిగా అమిత్ సా, రక్షన మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు తమ శాఖలను కొనసాగించే అవకాశం ఉంది. ఇతర మిత్రపక్షాల్లో ఎల్‌జేపీ కు చెందిన రామ్‌విలాస్‌కు, జేడీఎస్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ నేత సోనేలాల్, అనుప్రియ పటేల్ సోనేలాల్, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్ చౌదరి, హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన జితన్ రామ్ మాంఝీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. నిన్న ప్రధాని మోదీ నివాసంలో జరిగిన 11 గంటల సుదీర్ష సమావేశంలో మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇందులో మోదీతో పాటూ అమిత్ షా, బీజేపీ ఛీఫ్ జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్టొన్నారు. ఇక ఈరోజు సాయంత్రం 7.15గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికన్నా ముందు ఆయన మంత్రుల కోసం తన నివాసంలో టీ సమావేశాన్ని నిర్వహించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. టీడీపీ, జేడీయూలకూ మంత్రి పదవులు.. అయితే ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌లుగా మారిన టీడీపీ, జేడీయూ నేతలకు కూడా మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఇప్పటికే టీడీపీలోని ఇద్దరు నేతలకు కేంద్రం నుంచి కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈరోజు తర్వాత రెండు పార్టీల్లో ఎంతమందికి, ఏఏ పదవులు వచ్చాయో తెలిసే అవకాశం ఉంది. Also Read:GAZA: గాజాలో మళ్ళీ యుద్ధం..దాదాపు 200 మంది మృతి #tdp #bjp #modi-cabinet #jdu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి