BJP: రేపే బీజేపీ మేనిఫెస్టో విడుదల.. థీమ్ ఇదే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ రేపు (ఏప్రిల్ 14) తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. భారత్ సంకల్ప పత్రం పేరుతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు దీన్ని విడుదల చేయనున్నారు. By B Aravind 13 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఎన్డీయే కూటమితో కలిపి మొత్తం 400 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉంది. అయితే రేపు (ఏప్రిల్ 14) లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. భారత్ సంకల్ప పత్రం పేరుతో దీన్ని విడుదల చేయబోతోంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా.. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. Also Read: ప్రతి నెల మహిళల ఖాతాల్లో రూ.8,500.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన 'మోదీ గ్యారంటీ: 2047 నాటికి వికసిత్ భారత్' అనే థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇటీవల బీజేపీ.. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. దాదాపు 15 లక్షల సూచనలు వచ్చాయి. ఇందులో 4 లక్షల మందికి పైగా తమ అభిప్రాయలు నమో యాప్ ద్వారా పంచున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు కమిటీ.. మేనిఫెస్టోను రూపొందించింది. Also Read: భార్యను హత్య చేసి పరారయ్యాడు.. నిందితుడిపై రూ.2 కోట్ల రివార్డ్ #telugu-news #national-news #bjp #bjp-manifesto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి